హిట్ మ్యాన్ మ్యాచ్ ఆడితే స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది. తాజాగా రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. అదెంటో ఇప్పుడు చుద్దాం.
Not Easy To South Africa Wicket Down: Rohit Sharma
Rohith Sharma: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. విరాట్ కోహ్లీ, రాహుల్‌తో కలిసిన ఫొటోతో పాటు ఆటగాళ్లు.. వాళ్లను ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను రోహిత్ షేర్ చేశాడు. ఆ పోస్ట్‌కి ‘టుగెదర్’ అని క్యాప్షన్ ఇవ్వగా ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా బంగ్లాదేశ్‌పై మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్, విరాట్‌ను రోహిత్ హత్తుకున్నాడు. తర్వాత బ్యాట్స్మెన్లు వాళ్లను హత్తుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆటగాళ్లందరూ ఒక ఫామ్‌లో ఆడటం ఒక ఎత్తు అయితే.. అందరూ కలిసికట్టుగా ఉండటం ఒక ఎత్తు. రోహిత్ షేర్ చేసిన ఈ రెండు ఫొటోలు దీనికి నిదర్శనమని చెప్పవచ్చు.
ఇది కూడా చూడండి: Shot dead: బీజేపీ నేత బిర్జు తారామ్‌ను కాల్చిచంపిన నక్సలైట్లు
రోహిత్ చేసిన ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి క్రికెటర్ల వరకు అందరూ స్పందిస్తున్నారు. గెలుపోటములు పక్కన పెడితే..ఆటగాళ్ల మధ్య ఇలాంటి అనుబంధం చాలా ముఖ్యమని కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భారత్ క్రికెట్ టీమ్‌కు వీళ్లు ముగ్గురు పిల్లర్లు అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడంతో పాటు భారత్‌కు విజయాన్ని అందించాడు. అతనికి వన్డేల్లో ఇది 48వ సెంచరీ. భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డుకు చేరువలో కోహ్లీ నిలిచాడు. వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న 49 సెంచరీలకు సమీపంగా కోహ్లీ చేరుకున్నాడు.