»Another Defeat For Pakistan A Great Victory For Australia
AUS vs PAK: పాక్కు మరో ఓటమి.. ఆస్ట్రేలియా ఘన విజయం
నేడు జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. పాక్ జట్టు విఫలం అయ్యింది. ఈ టోర్నీలో పాక్ జట్టుకు ఇది రెండో ఓటమి. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ సూపర్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డు అందుకున్నాడు.
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో నేడు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన పాక్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేపట్టగా నిర్ణీత 50 ఓవర్లలో 367 పరుగుల చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన పాక్ జట్టు మిడిలార్డర్ ఘోరంగా విఫలం అయ్యింది. దీంతో పాక్ ఖాతాలో మరో ఓటమి చేరింది. 45.3 ఓవర్లో 305 పరుగులకే పాక్ జట్టు ఆలౌట్ అయ్యింది.
భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పాక్ జట్టు తొలి వికెట్కు 134 పరుగులు చేసింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ 61, ఇమామ్ ఉల్ హక్ 71 పరుగులు చేసి స్కోరును ముందుకు నడిపించారు. ఇమామ్ ఉల్ హక్ ఔట్ అయిన తర్వాత పాక్ గెలుపుపై ఆశలు ఆవిరయ్యాయి. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా నేటి మ్యాచ్లో విఫలమయ్యాడు. 14 బంతుల్లో 3 బౌండరీలు చేసి 18 పరుగులకు ఔట్ అయ్యాడు.
💯 David Warner, 163 💯 Mitchell Marsh, 121 ⭐ Shaheen Shah Afridi, 5/54
పాక్ బ్యాటర్లు సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ కొంతమేరకు ఆడినప్పుడు పాక్ విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే వారు కూడా ఔట్ అవ్వడంతో ఆ తర్వా వికెట్లు వెంట వెంటనే పడ్డాయి. దీంతో 45.3 ఓవర్లో 305 పరుగుల చేసి పాక్ జట్టు ఆలౌట్ అయ్యింది. 62 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఆసీస్ టీమ్ లో డేవిడ్ వార్నర్ (David warner) 85 బంతుల్లోనే సెంచరీ (Century) చేయగా మార్ష్ కూడా 100 బంతుల్లో సెంచరీ చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును డేవిడ్ వార్నర్ అందుకున్నాడు.
David Warner entertained the Chinnaswamy crowd with his fireworks 🎇