Harbhajan Singh Suggest To Rohit Sharma On Team Changes
Harbhajan Singh: వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరసగా విజయాలు సాధిస్తోంది. రేపు (ఆదివారం) న్యూజిలాండ్‌తో మ్యాచ్ జరగనుంది. ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యా కాలి చీలమండకు గాయం అయ్యింది. దీంతో కివీస్‌తో మ్యాచ్‌లో అందుబాటులో ఉండరు. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా ధృవీకరించింది. సో.. కెప్టెన్ రోహిత్ శర్మకు (Rohith Sharma) కీలక సూచనలు చేశాడు మాజీ బౌలర్ హార్బజన్ సింగ్ (Harbhajan Singh).
టీమ్‌లో పాండ్యా లోటును భర్తీ చేసేందుకు రెండు మార్పులు చేయాలని హర్భజన్ సింగ్ అంటున్నాడు. ధర్మశాల పిచ్ స్వింగ్ అవుతుందని గుర్తుచేశాడు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు బదులు సీమర్ మహ్మద్ షమీకి అవకాశం ఇవ్వాలని భజ్జీ అంటున్నాడు. ఆరో స్థానంలో ఇషాన్ కిషన్ లేదంటే సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించాలని కోరాడు.
ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీని తీసుకోవాలని సజెస్ట్ చేశాడు. షమీతో 10 ఓవర్లు వేయించాలని ఫలితం ఉంటుందని చెప్పాడు. మరీ భజ్జీ సూచనను కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రావిడ్ ఏం చేస్తారో చూడాలి. ఇప్పటివరకు అయితే భారత జైత్రయాత్ర కొనసాగుతోంది.