»Pujaras Comments On Kohlis Century Went Viral Suggesting That The Team Should Play For Victory
World Cup 2023: గెలుపుకోసం ఆడాలి కోహ్లీ సెంచరీపై పుజారా కామెంట్స్
ప్రపంచకప్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో ఆడిన నాలుగవ మ్యాచ్‌లో కోహ్లీ ఆటకు అందరు ఎంతో ఫిదా అయ్యారు. ప్రతి ఒక్కరు కోహ్లీ చేసిన సెంచరీ గురించే మాట్లాడారు. తాజాగా ఆయన సెంచరీపై పుజారా అసంతృప్తి వ్యక్తం చేశారు. సెంచరీ కాదు..టీమ్ విజయం ముఖ్యం అంటున్నారు.
Pujara's comments on Kohli's century went viral.. Suggesting that the team should play for victory
World Cup 2023: ప్రపంచకప్(ODI World Cup 2023)లో టీమ్ఇండియా(Team India) వరుస విజయాలను నమోదు చేస్తుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అద్భుతమైన ప్రదర్శనతో సెమీస్ రేసులో దూసుకుపోతుంది. అలాగే కోహ్లీ తనదైన ఆటను ప్రదర్శించి బంగ్లాపై శతకం బాదాడు. తాజాగా విరాట్ సెంచరీ చేసిన తీరుపై వెటరన్ క్రికెటర్ పుజారా(Cheteshwar Pujara) అసంతృప్తి వ్యక్తం చేశారు. సెంచరీకి చేరుకునే సమయంలో కోహ్లీ నెమ్మదిగా ఆడడం, తన పార్ట్నర్ అయిన కేఎల్ రాహుల్ అతనికి సహరిచండంతో పుజారా కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం తాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బంగ్లాదేశ్ ఆటలో రోహిత్ శర్మ ఔట్ అయిన తరువాత విరాట్ కోహ్లీ ఆట తీరు చాలా నచ్చింది. ఆ సమయంలో కోహ్లీ సెంచరీ చేయాలని తాను ఎంతగానో కోరుకున్నట్లు పుజారా పేర్కొన్నారు. అయితే గేమ్‌ను ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. ఆటగాడి నెట్ రన్‌రేట్ అగ్రస్థానంలో ఉండాలంటే బంతులను వృథా చేయడం సబబు కాదని వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో కోహ్లీతోపాటు ఇతర సభ్యులు కూడా జట్టుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అలాగే వ్యక్తిగతంగా స్కోర్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు త్యాగం చేయాల్సి ఉంటుందని పుజారా వివరించారు. జట్టుకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆటగాళ్లకు మైలురాళ్లు అవసరమే. అయితే జట్టు ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించకూడదు. ఓ ఆటగాడిగా మీకు ఎప్పుడూ ఛాయిస్ ఉండాలి.
కానీ కొందరు ఆటగాళ్లు సెంచరీ చేస్తే..అది తర్వాతి గేమ్‌లో సహాయపడుతుందని భావిస్తారు. అలా ఉండదు మీరు కనబరిచిన ఆట తీరును పరిగణలోకి తీసుకుంటారు. తప్ప కేవలం చేసిన పరుగులనే కాదని అన్నారు. ఈ విషయంపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ బ్యాటింగ్ చేసే సమయంలో వికెట్లు, ఓవర్లు ఉన్నాయని, అలాగే ఆయనకు సెంచరీ చేయడం చాలా ముఖ్యమని అంటున్నారు. కోహ్లీ వన్డే మ్యాచ్‌లలో ఇప్పటికి 48 సెంచరీలు చేశాడు. ఇదే విషయంపై కేఎల్ రాహుల్ కూడా మ్యాచ్ గెలిచిన రోజే స్పందించారు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా కోహ్లీ వద్దన్నాడని, కేఎస్ రాహుల్ పట్టుబట్టడంతో ఆయన శతకం చేశాడని పేర్కొన్నారు.