Icc odi world cup 2023: బ్యాంటింగ్ చేస్తున్న నెదర్లాండ్స్..శ్రీలంక బోణీ కొట్టేనా?
ఈరోజు ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా రెండు మ్యాచులు ఉన్నాయి. ఉదయం పదిన్నరకు ఒకటి మొదలు కాగా..మధ్యాహ్నం రెండు గంటలకు మరొకటి ప్రారంభం కానుంది. ఉదయం మ్యాచ్ ఇప్పటికే మొదలు కాగా..మొదట టాస్ గెల్చిన నెదర్లాండ్స్ జట్టు బ్యాంటింగ్ ఎంచుకుంది. అయితే ఈ గేమ్‌లో ఏ జట్టు గెలుస్తుందో ఇప్పుడు చుద్దాం.
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023(icc odi world cup 2023)లో నేడు నెదర్లాండ్స్(Netherlands), శ్రీలంక(srilanka) జట్ల మధ్య 19వ మ్యాచ్ జరగుతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ పదిన్నరకు మొదలైంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకపై డచ్ బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ రెండో బ్యాటింగ్ చేసి ఓడిపోయింది. మరోవైపు ఇప్పటికే మూడు గేముల్లో ఓడిన శ్రీలంక ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. డచ్ జట్టు గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 38 పరుగుల తేడాతో ఓడించింది. ఇక పాయింట్ల పట్టికలో నెదర్లాండ్స్ మూడు మ్యాచులు ఆడి, ఒకటి గెలువగా..శ్రీలంక ఏకంగా మూడింటిలో ఓడిపోయి చివరలో 10వ స్థానంలో ఉంది.
నెదర్లాండ్స్, శ్రీలంక జట్లు ఇప్పటి వరకు 5 సార్లు తలపడగా, ఆసియా క్రికెట్ దిగ్గజాలు అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2002లో వీరు తొలిసారిగా తలపడ్డారు. లంక తరఫున మార్వన్ అటపట్టు సెంచరీ చేసి జట్టును 50 ఓవర్లలో 292/6కు చేర్చాడు. లంక బౌలర్లు డచ్ బ్యాట్స్మెన్లను 30 ఓవర్లలో 86 పరుగులకే కట్టడి చేశారు.
నెదర్లాండ్స్ జట్టులో:మాక్స్ ఓ’డౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్ (C మరియు WK), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్ మరియు పాల్ వాన్ మీకెరెన్ ఉన్నారు.
శ్రీలంక జట్టులో:పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (సి అండ్ డబ్ల్యూకే), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత మరియు దిల్షన్ మదుశంక ఉన్నారు.