»Rest Of World Mike Snatched From Activist Greta Thunberg Issue Of War Between Israel And Hamas Raised In Netherlands Climate Rally
Netherlands: నెదర్లాండ్స్ క్లైమేట్ ర్యాలీ.. మైక్ కోసం కొట్టుకున్న కార్యకర్తలు
నెదర్లాండ్స్ క్లైమేట్ ర్యాలీలో పాల్గొన్న ప్రముఖ స్వీడిష్ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ ప్రసంగిస్తుండగా.. మరో కార్యకర్త మైక్ లాక్కొని ఇక్కడ వాతావరణంపై మాత్రమే చర్చ ఉంటుందని చెప్పారు.
Netherlands: నెదర్లాండ్స్ క్లైమేట్ ర్యాలీలో పాల్గొన్న ప్రముఖ స్వీడిష్ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ ప్రసంగిస్తుండగా.. మరో కార్యకర్త మైక్ లాక్కొని ఇక్కడ వాతావరణంపై మాత్రమే చర్చ ఉంటుందని చెప్పారు. వారు వాతావరణం గురించి మాట్లాడటానికి వచ్చారు.. ఇక్కడ రాజకీయ అభిప్రాయం అవసరం లేదన్నారు. ఇద్దరి మధ్య చర్చ జరుగుతుండగానే గ్రేటా మద్దతుదారులు వెంటనే ఇతర కార్యకర్తను చుట్టుముట్టి వేదికపై నుంచి కిందకు దించారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధ సమస్యను లేవనెత్తడం ద్వారా పాలస్తీనియన్లకు అనుకూలంగా గ్రెటా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమ్‌స్టర్‌డామ్‌లో క్లైమేట్ ర్యాలీలో మాట్లాడటానికి ఒక పాలస్తీనియన్, ఒక ఆఫ్ఘన్ మహిళను వేదికపైకి ఆహ్వానించిన తర్వాత ఒక వ్యక్తి వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్‌ను క్లుప్తంగా అడ్డుకున్నాడు. గ్రేటా థన్‌బర్గ్ వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు.
Climate activist Greta Thunberg's speech in Amsterdam's Museum Square was briefly interrupted by a protester who grabbed her microphone and accused her of turning a march demanding immediate action against climate change into a political event https://t.co/CiykjdS06Gpic.twitter.com/csGhWYqD4p
థన్‌బెర్గ్ వేదికపైకి రాకముందే కొద్దిసేపు కార్యకర్తలు పాలస్తీనా జెండాలను ఊపుతూ పాలస్తీనా అనుకూల నినాదాలు పలుకడంతో ఈవెంట్‌కు కొంతసేపు అంతరాయం కలిగింది. నెదర్లాండ్స్‌లో సార్వత్రిక ఎన్నికలకు 10 రోజుల ముందు వాతావరణ మార్పులపై తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వేల మంది నిరసనకారులు ఆమ్‌స్టర్‌డామ్‌లో కవాతు నిర్వహించారు. వాతావరణ కార్యకర్త గ్రేటా థన్‌బెర్గ్, మాజీ EU క్లైమేట్ చీఫ్ ఫ్రాంస్ టిమ్మర్‌మాన్స్ సహా దాదాపు 70,000 మంది ఈ మార్చ్‌లో చేరారని నెదర్లాండ్స్ పోలీసులు తెలిపారు. వీరు రాబోయే ఎన్నికలలో సంయుక్త లేబర్, గ్రీన్ పార్టీలకు నాయకత్వం వహిస్తారు.