»Amazing Team India Achieved That Record After 31 Years
TeamIndia Record: అద్భుతం..31 ఏళ్ల తర్వాత ఆ రికార్డ్ సాధించిన టీమిండియా!
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లు 9 మంది బౌలింగ్ వేసి రికార్డు సాధించారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా అందరూ బౌలింగ్ వేశారు. 31 ఏళ్ల తర్వాత ఇలా 9 మంది బౌలింగ్ వేయడంతో టీమిండియా రికార్డు సాధించింది.
వన్డే ప్రపంచ కప్ 2023 (ODI World Cup-2023)లో టీమిండియా (TeamIndia) అదరగొడుతోంది. ఈ టోర్నీలో లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచి సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. నిన్న జరిగిన నెదర్లాండ్స్ మ్యాచ్‌లో టీమిండియా ఓ అద్భుత రికార్డును నమోదు చేసింది. అది కూడా 31 ఏళ్ల తర్వాత ఆ రికార్డును సాధించడం విశేషం. నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన ఆ మ్యాచ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా అందరూ బౌలింగ్ వేశారు.
వన్డే వరల్డ్ కప్‌లో ఓ ఇన్నింగ్స్‌లో 9 మంది బౌలింగ్ (9 members Bowling) చేశారు. ఇలా జట్టు సభ్యుల్లో అంతమంది బౌలింగ్ చేయడం 31 ఏళ్ల తర్వాత జరిగింది. ఇప్పటి వరకూ ఇటువంటివి రెండు మాత్రమే జరిగాయి. టీమిండియా మొదటిసారి ఇలాంటి ప్రయోగం చేసి ఆ రికార్డును సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) ఆధ్వర్యంలో ఇలాంటి ప్రయోగం చేయడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1987 వన్డే ప్రపంచ కప్‌లో మొదటిసారి ఇలాంటిది జరిగింది. ఫెషావర్ స్టేడియంలో శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు తలపడగా ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఏకంగా 9 మందితో బౌలింగ్ చేయించింది. అలాగే 1992 వన్డే ప్రపంచ కప్‌లో రెండోసారి ఇలాంటిది చోటుచేసుకుంది. క్రైస్ట్ చర్చ్ గ్రౌండ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు 9 మంది బౌలింగ్ వేశారు.
ఇకపోతే మూడోసారి 31 ఏళ్ల తర్వాత నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా (TeamIndia) ఈ ప్రయోగం చేపట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ 9 మంది బౌలర్లతో బౌలింగ్ చేయించాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా, షమీ, సిరాజ్, కుల్దీప్ యాదవ్, జడేజా, కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌లు బౌలింగ్ వేసి విజయం (victory) సాధించారు.