లెజెండరీ క్రికెటర్,మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (Bishan Singh Bedi) (77) కన్నుమూశారు. భారత్ తరఫున ఆయన 67 టెస్టులు, 10 వన్డేలు ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 370 మ్యాచుల్లో 10 వికెట్లు తీశారు. ఈయన ఎంతో మంది యువ క్రీడాకారులను తీర్చిదిద్దారు. దిగ్గజ స్పిన్నర్ 1967 -1979 మధ్య భారత్ తరపున 67 టెస్టులు ఆడి 266 వికెట్లు తీశాడు. 10 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు.
ఎరపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్ వెంకటరాఘవన్(Venkataraghavan)లతో పాటు బేడీ భారత్ స్పిన్ బౌలింగ్ దశ, దిశను మార్చాడు. భారత్ తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించింది బిషన్‌సింగ్ బేడినే. 1975 ప్రపంచ కప్ (World Cup) మ్యాచ్‌లో అతని 12 ఓవర్లు వేసి కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ 12 ఓవర్లలో అతను ఏకంగా ఎనిమిది మెయిడిన్లు చేశాడు. ఒక్క వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా తూర్పు ఆఫ్రికాను 120 స్కోరుకే పరిమితం చేసింది.