»Mayank Yadav This Is The Reason To Stop Eating Meat
Mayank Yadav: మాంసాహారం మానేయడానికి కారణం ఇదే!
మయాంక్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ 17 సీజన్లో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. అయితే మయాంక్ మాంసాహారం ఎందుకు మానేశాడో తెలుసుకుందాం.
Mayank Yadav: మయాంక్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ 17 సీజన్లో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే టీమ్ఇండియాకు ఆడటం ఖాయమనిపిస్తోంది. మయాంక్ తల్లిదండ్రులు కూడా తమ కుమారుడు త్వరలో టీమ్ఇండియాకు ఆడతాడని నమ్ముతున్నారు. ఈ విషయంలో మయాంక్ తండ్రి ఎంతో నమ్మకంగా ఉన్నారు. అయితే మయాంక్ గతంలో మాంసాహారం తినేవాడు.
ప్రస్తుతం పూర్తి శాఖాహారుడిగా మారిపోయాడు. గత రెండేళ్లుగా వెజ్‌టేరియన్ ఫుడ్ మాత్రమే తింటున్నాడు. తన డైట్ చార్ట్‌కు అనుగుణంగా ఏది కావాలో అది తింటున్నాడని మయాంక్ తల్లి తెలిపారు. ప్రత్యేకంగా ఏం తినడు.. పప్పు, రోటీ, అన్నం, పాలు, కూరగాయలు వంటివి తింటాడన్నారు. మయాంక్ నాన్ వెజ్ మానేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అతను శ్రీకృష్ణుడిని నమ్మడం మొదలుపెట్టాడు. రెండోది మాంసాహారం తన శరీరానికి పడటం లేదని మయాంక్ తల్లి తెలిపారు.