Australia: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా (team india) బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. సీజన్ మొత్తం చక్కగా ఆడినప్పటికీ.. ఫైనల్ ఫీవర్ వెంటాడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సమయంలో రోహిత్ శర్మ- గిల్ చక్కని భాగస్వామ్యం ఇచ్చారు. టీమ్ స్కోర్ 30 పరుగులు వద్ద గిల్ ఐటయ్యాడు. తర్వాత ఏ బ్యాట్స్ మెన్ కూడా నిలదొక్కుకోలేదు.
రోహిత్ శర్మ దూకుడుగా ఆడి.. 47 పరుగుల వద్ద ఔటయ్యాడు. తర్వాత కోహ్లి వచ్చి కాసేపు ఆగాడు. శ్రేయస్ అయ్యర్ మాత్రం నిరాశ పరిచాడు. 4 పరుగులు చేసి స్టాండ్స్ వైపు నడిచాడు. కోహ్లీ 54 పరుగులు చేసి ఔటయ్యాడు. రాహుల్ రావడంతో కాస్తా ఊపు వచ్చింది. హాఫ్ సెంచరీ దాటింది. ఇక స్కోర్ బోర్డుకు వచ్చిన ఇబ్బందేం లేదని అనుకున్నారు అంతా.. 66 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఆ తర్వాత ఏ బ్యాట్స్ మెన్ కనీసం ఆడే ప్రయత్నం చేయలేదు. రవీంద్ర జడేడా కేవలం 9 పరుగులు చేసి ఔటయ్యాడు. స్కై 18 పరుగులు చేసి క్యూ కట్టాడు. షమీ 6, బూమ్రా 1, యాదవ్ 10, సిరాజ్ 9 రన్స్ చేశారు. దీంతో స్కోర్ 240 పరుగులు అయ్యింది. అహ్మదాబాద్ పిచ్ బౌలర్లకే సహకరించింది. బ్యాట్స్ మెన్ అంతా ఫెయిల్ అయ్యారు. మరి సెకండ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటివరకు అయితే షమీ, సిరాజ్ బాల్‌తో దుమ్ము రేపారు. ఈ రోజు బూమ్రా, జడేజా మాయ చేయాలి. లేదంటే 140 కోట్ల ఆశ, ఆకాంక్షపై ప్రభావం ఉంటుంది.
భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లు ఆడి.. వికెట్లు అన్నీ కోల్పోయింది. 240 పరుగులు మాత్రమే చేశారు. రోహిత్ శర్మ 47, కోహ్లీ 54, రాహుల్ 66 తప్పితే మిగతా అందరూ ఫెయిల్ అయ్యారు. చివరికీ సూర్యకుమార్ యాదవ్ కూడా 18 పరుగులు చేసి క్యూ కట్టాడు.