»Assailant Rushed To Kohli Netizens Fire On Security Lapse
Kohli వద్దకు దూసుకొచ్చిన పాలస్తీనా మద్దతుదారుడు.. నెటిజన్లు ఫైర్
వరల్డ్ కప్ మ్యాచ్ జరిగే సమయంలో కింగ్ కోహ్లీ వద్దకు పాలస్తీనా మద్దతుదారుడు దూసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్టేడియం సిబ్బంది వచ్చి అతనిని బయటకు తీసుకెళ్లారు.
Kohli: అహ్మదాబాద్‌లో గల మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అంతా.. మ్యాచ్‌ను ఉత్కంఠగా చూస్తున్నారు. 14వ ఓవర్ వేసే సమయంలో ఓ యువకుడు గ్రౌండ్లోకి వచ్చాడు. భద్రతా వలయాన్ని తప్పించుకుని వచ్చిన అతను.. బ్యాటింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ (Kohli) వద్దకు పరుగు తీశాడు. కోహ్లీ భుజంపై చేయి వేసి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. వరల్డ్ కప్ ఫైనల్.. మ్యాచ్‌లో ఇలా జరగడంతో నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.
కోహ్లిని (Kohli) హాగ్ చేసుకొని.. మాట్లాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే వచ్చిన సిబ్బంది అతనిని బయటకు తీసుకెళ్లారు. అతను వేసుకున్న టీ షర్ట్‌పై పాలస్తీనాపై బాంబులు వేయడం ఆపండి.. పాలస్తీనాకు విముక్తి కల్పించండి అని రాసి ఉంది. చేతిలో పాలస్తీనా జెండా పట్టుకొని ఉన్నాడు. మాస్క్ ధరించి ఉండటంతో.. దానిపై పాలస్తీనా జెండా ముద్రించి ఉంది. అతనిని బయటకు తీసుకెళ్లిన తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
ఫైనల్ మ్యాచ్ కోసం ప్రధాని మోడీ (modi) వస్తారు. ఇప్పటికే స్టేడియంలో గల వీఐపీ గ్యాలరీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సినీ ప్రముఖులు షారుక్ ఖాన్, విక్టరీ వెంకటేష్, దీపాకా పదుకొనె, రణవీర్ సింగ్, అనుష్క శర్మ, సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఇంతటి కీలక మ్యాచ్‌లో భద్రతా డొల్లతనం బట్టబయలైంది. కోహ్లీ వద్దకు ఆగంతకుడు రావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని అడిగారు.