»Rohit Sharma Breaks Another Record At World Cup Final Match
Rohit ఖాతాలో మరో రికార్డ్.. విలియమ్సన్ రికార్డ్ బ్రేక్
వన్డే వరల్డ్ కప్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డుల మోత కొనసాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్‌లో 47 పరుగులు చేసి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఒక ఎడిషన్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు.
Rohit Sharma Breaks Another Record At World Cup Final Match
Rohit Sharma: వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు. ప్రత్యర్థి ఏ జట్టు అయినా సరే.. ఏ బౌలర్ అయినా సరే.. చీల్చి చెండాడుతున్నాడు. తొలి 10 ఓవర్లలోనే జట్టుకు మంచి స్కోరు అందిస్తున్నాడు. రోహిత్ ధాటిగా ఆడటంతో మిడిల్ ఆర్డర్ పని ఈజీ అవుతుంది. తర్వాత వచ్చిన వారు మెల్లిగా జట్టుకు భారీ స్కోర్ అందిస్తున్నారు.
ఒక ఎడిషన్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) నిలిచాడు. 2019 వరల్డ్ కప్‌లో విలియమ్సన్ 578 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి మ్యాచ్‌లో 29 రన్స్ చేయడంతో ఆ రికార్డ్ బ్రేక్ చేశాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఔటయ్యాడు. దీంతో టోర్నీలో 597 పరుగులు చేసినట్టు అయ్యింది.
తొలి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ (Rohit) నిలిచాడు. టోర్నిలో ఇప్పటివరకు 354 పరుగులు చేశాడు. ఈ రోజు 47 రన్స్ చేయడంతో అవి 401 అయ్యాయి. గతంలో ఆ రికార్డు న్యూజిలాండ్ ప్లేయర్ మెక్ కల్లం పేరుతో ఉండేది. అతను 308 పరుగులు చేశాడు. 2003 వరల్డ్ కప్‌లో గిల్ క్రిస్ట్ 10 ఓవర్లలో 276 పరుగులు చేశాడు.
వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ (Rohit) నాలుగో స్థానానికి చేరాడు. 28 ఇన్సింగ్సుల్లో 1575 పరుగులు చేశాడు. రోహిత్ కంటే ముందు సచిన్ 2278, కోహ్లీ 1752, పాంటింగ్ 1743 ఉన్నారు. రోహిత్ తర్వాత వార్నర్ ఉన్నాడు. అతను 1520 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడు రోహిత్ శర్మనే కావడం విశేషం. 11 మ్యాచ్‌ల్లో 31 సిక్సులు కొట్టాడు.