ఆల్ ది బెస్ట్.. కప్ గెలవాలి.. 140 కోట్ల మంది భారతీయులు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మ్యాచ్లో విజయం సాధించాలి. క్రీడాస్ఫూర్తిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ప్రధాని మోడీ కోరారు. ఇప్పటికే టీమిండియా (team india) రికార్డులతో మోత మోగించిందని.. యావత్ ప్రపంచం ఈ రోజు టీమిండియాకు అండగా నిలబడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
టీమిండియా ప్లేయర్లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. మీ కోసం వంద కోట్లకు పోగా హృదయాలు స్పందిస్తున్నాయి. వరల్డ్ కప్ తీసుకొద్దాం.. ఇండియాను గెలిపించండి అని కోరారు. టీమిండియాకు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (kejriwal) శుభాకాంక్షలు తెలిపారు. మీ సత్తా చూపే అవకాశం వచ్చింది.. అత్యుత్తమ ఆటతీరును బయటకి తీసుకురండి.. జైత్రయాత్రను కొనసాగిస్తూ.. చరిత్ర సృష్టించాలని కోరారు. భారత జట్టుకే కేసీ వేణుగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్లో టీమిండియా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ ఆల్ ద బెస్ట్ చెప్పింది.