World Cup Final : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమ్ఇండియా ఫస్ట్ బ్యాటింగ్
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా ప్రారంభమైన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ముందుగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్ కు దిగనుంది. నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూ వచ్చిన వన్డే ప్రపంచకప్ పండుగ ముంగిపు దశకు చేరింది. ట్రోఫీ కోసం జరిగే ఫైనల్ పోరులో భారత్ (India), ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ముందుగా ఆస్ట్రేలియా టాస్ (Toss) గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్ కు దిగనుంది.
ఇక ఐదుసార్లు విశ్వ విజేత అయిన ఆసీస్ (Aussies) కొమ్ములు వంచి… మూడోసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు ఆరోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని కంగారూలు కసిగా ఉన్నారు. ప్రపంచ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో 6వసారి ఎగరేసుకుపోవాలని ఆస్ట్రేలియా..మరికొద్ది క్షణాల్లో వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి పోరాటం మొదలుకానుంది. టీమిండియా కప్ గెలవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఫైనల్ ఫీవర్ కనిపిస్తోంది. ఎక్కడ చూసిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ (World Cup Final) గురించే మాట్లాడుకుంటున్నారు.