»Edelweiss Ceo Radhika Gupta Support To Rohit Sharma
Rohit నీకు వంద కోట్ల హృదయాలు ప్రేమను పంచుతున్నాయి
వరల్డ్ కప్ ఓడిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ అంతా బోరుమని ఏడ్చేశారు. రోహిత్ శర్మ ఏడ్చిన వీడియో వైరల్ అయ్యింది. మీరు చక్కగా ఆడారు.. టఫ్ ఇచ్చారని ప్రముఖులు చెబుతున్నారు. ధైర్యంగా ఉండు రోహిత్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.
Rohit Sharma: వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. కప్ గెలుస్తామని అనుకొని బోల్తా కొట్టింది. దీంతో చాలా మంది అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక ప్లేయర్లు అయితే బోరున ఏడ్చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీమిండియా చక్కగా ఆడిందని.. అందరూ ధైర్యం చెబుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కంటతడి పెట్టిన వీడియో తెగ తిరుగుతోంది. ఆ వీడియో చూసి మ్యూచువల్ ఫండ్స్ ఎడిలి వీస్ సీఈవో రాధికా గుప్తా స్పందించారు.
రాధికా గుప్తా ఒక్కరే కాదు.. చాలా మంది ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. టీమిండియా చక్కగా ఆడిందని.. ధైర్యం కోల్పోవద్దని కోరింది. ఇక రోహిత్ శర్మ (Rohit Sharma) అయితే టోర్నీ మొత్తం చక్కగా రాణించాడు. ఫైనల్లో కూడా ధాటిగా ఆడి.. మిడిల్ ఆర్డర్‌కు అప్పగించాడు. ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తక్కువ స్కోర్ చేశారు. రోహిత్ (Rohit) అయితే సొంత రికార్డులను కూడా చూడలేదు. మిగతా ఆటగాళ్లకు కూడా అదే చెప్పాడు. అందుకే ధాటిగా ఆడేశాడు. ఫైనల్లో ఓటమిని జీర్ణించుకోలేక పోయాడు.
గొప్ప నాయకులకు కూడా చెడు రోజులు ఉంటాయని రాధిక గుప్తా ఎక్స్‌లో రోహిత్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆ కన్నీళ్లు నిన్న బలహీన పరచలేవు. మరింత శక్తిమంతుడిని చేస్తాయ్. వంద కోట్ల హృదయాలు ప్రేమను పంచుతున్నాయ్ రోహిత్ అని పేర్కొన్నారు. రోహిత్ ఏడ్చే ఫోటను షేర్ చేశాడు.
తెలంగాణ రాష్ట్రంలో 2018తో పోలిస్తే 3 శాతం పోలింగ్ తగ్గిందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా, యాకత్ పుర నియోజకవర్గాల్లో అత్యల్ప పోలింగ్ నమోదైందని వివరించారు.