»Fix Deployed Ceo Of Firm Behind Global Microsoft Outage
Fix Deployed: మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్య క్లియర్.. కంపెనీ సీఈఓ
క్రౌడ్‌స్ట్రైక్ 'ఫాల్కన్ సెన్సార్' అప్డేట్ చేయడం వలనే మైక్రోసాఫ్ట్ విండోస్‌లో అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ సీఈఓ వెల్లడించారు. సమస్య ఏంటో కనుగొన్నామని, దాన్ని పరిష్కరించామని తెలిపారు.
Fix Deployed: CEO Of Firm Behind Global Microsoft Outage
Fix Deployed: క్రౌడ్‌స్ట్రైక్ ‘ఫాల్కన్ సెన్సార్’ అప్డేట్ చేయడం వలనే మైక్రోసాఫ్ట్ విండోస్‌లో అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ సీఈఓ వెల్లడించారు. సమస్య ఏంటో కనుగొన్నామని, దాన్ని పరిష్కరించామని తెలిపారు. ఈ ఎర్రర్ వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలపై, స్టాక్ ఎక్స్ఛేంజీలపై, సూపర్ మార్కెట్లు, విమాన సేవలపై ప్రభావం చూపింది. విండోస్ స్క్రీన్‌పై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) సమస్య తలెత్తింది. దీని వలన సిస్టమ్ షట్ డౌన్, రీస్టార్ట్ అయింది.
CrowdStrike CEO జార్జ్ కర్ట్జ్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు.. Windows హోస్ట్‌ల కోసం ఒకే కంటెంట్ అప్డేట్ చేయడంతో ఈ ఎర్రర్ ఏర్పడిందని అయితే Mac, Linux లతో పనిచేసే సిస్టమ్‌లపై ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. దీనిపై ఆయన క్లియర్ స్టేట్ మెంట్ ఇచ్చారు. “సమస్య గుర్తించబడింది, పరిష్కారించబడింది. వినియోగాదారులు విండోస్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కంపెనీ పోర్టల్‌ను గమనించమని చెప్పారు.
“అధికారిక ఛానెల్‌ల ద్వారా వారు క్రౌడ్‌స్ట్రైక్ ప్రతినిధులతో కమ్యూనికేట్ చేస్తున్నామని, వారు చెప్పే పద్దతిని ఉపయోగించి సమస్య పరిష్కించుకోవాలని చెప్పారు. దీనిపై మైక్రోసాఫ్ట్ ఇలా చెప్పింది.. ” ఈ సమస్యన పరిష్కరించడానికి అందరము కష్టపడుతున్నాము, పరిస్థితిని ఎప్పటికప్పుడు మానెటరింగ్ చేస్తున్నాము దీనికోసం మైక్రోసాఫ్ట్ 365 యాప్‌లు పనిచేస్తున్నాయంది. ప్రస్తుతం మంచి ఫలితాలు వస్తున్నట్లు పేర్కొంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) కింది పద్ధతిని ఉపయోగించి సమస్య నుంచి బయటపడొచ్చు అని తెలిపింది.
– విండోస్‌ను సేఫ్ మోడ్‌లోకి బూట్ చేయండి లేదా విండోస్ రికవరీ ఎన్విరాన్మెంట్ C:\Windows\System32\drivers\CrowdStrike డైరెక్టరీకి నావిగేట్ చేయండి “C-00000291*.sys” సరిపోలే ఫైల్‌ను గుర్తించి, దాన్ని తొలగించండి. అని పేర్కొంది.