Anand Mahindra: అహ్మదాబాద్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. కొందరు మ్యాచ్ చూస్తే ప్లేయర్స్ సరిగా ఆడరని అనుకుంటారు. వారిలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) ఉన్నారు. అమితాబ్‌ను మ్యాచ్ చూడొద్దని నెటిజన్లు కోరారు. దానికి సంబంధించి ఇన్ఫో లేదు. కానీ ఆనంద్ మహీంద్రా మాత్రం మ్యాచ్ చూడటం లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్లాన్ చేసుకోవడం లేదు. ఎందుకంటే జెర్సీ వేసుకుని రూమ్‌కి పరిమితం అవుతానని తెలిపారు. మ్యాచ్ పూర్తయినా తర్వాత దానికి గురించి చెబితేనే తనకు తెలుస్తోందని వివరించారు. అంతకుముందు తాను చూసిన ప్రతీ మ్యాచ్ ఓడిపోయిందని.. అందుకే ఈ సారి దూరంగా ఉండాలని అనుకున్నానని చెప్పారు.
అమితాబ్ కూడా ఇలాగే చెప్పారు. కానీ చూసే విషయం కానీ.. చూడటం లేదని ప్రకటన చేయలేదు. ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ట్వీట్‌కు నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. మీరు ఎప్పటికీ మా హీరోనే.. మీ త్యాగాన్ని చరిత్ర గుర్తించకపోవచ్చు.. మీ సేవలకు ప్రాచుర్యం కల్పిస్తాం అని రాశారు. జట్టుకు మద్దతుగా నిలవడంలో భాగమేనని చెప్పారు.