సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని.. ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి తీసుకెళ్లారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ శవరాజకీయం చేస్తోందని వాళ్ల డీఎన్‌లోనే శవరాజకీయం ఉందని చంద్రబాబు అన్నారు.
Chandrababu: సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని.. ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి తీసుకెళ్లారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ శవరాజకీయం చేస్తోందని వాళ్ల డీఎన్‌లోనే శవరాజకీయం ఉందని చంద్రబాబు అన్నారు. తండ్రి లేరు.. బాబాయ్‌ని చంపారంటూ జగన్ ఓట్లు అడిగారన్నారు. రక్తంలో మునిగిన వైసీపీకు ఓట్లు వేయవద్దని అతని చెల్లే కోరుతున్నారు. హత్యలు, శవరాజకీయాలు చేసేవారు ప్రజలకు కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. కానీ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. ప్రజలకు సేవ చేయాలి.
మా ప్రభుత్వం వచ్చాక కూడా వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం. సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే వీలుంది. ఎండలో సచివాలయానిక వెళ్లడం వల్ల ఒకరిద్దరు చనిపోయారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నానని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఇవ్వలేకపోతే టీడీపీ వచ్చిన తర్వాత రూ.4 వేల చొప్పున ఫించను ఇస్తామని తెలిపారు. టీడీపీ వచ్చిన తర్వాత సంపద సృష్టించి పేదలకు పంచుతాం. వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్ మద్యం ఉండవు. ఇసుక కొరత ఉండదు. విద్యుత్ ఛార్జీలు పెరగవని చంద్రబాబు అన్నారు.