NRML: దిలావర్పూర్ మండలంలో ఆదివారం జరిగిన 12 గ్రామ పంచాయతీలో ఎన్నికలలో 82.63 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 18,744 మంది ఓటర్లు ఉండగా 15488 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా కంజర్ గ్రామపంచాయతీలో 89 శాతం ఓటింగ్ నమోదు కాగా మాయాపూర్‌లో అత్యల్పంగా 77 శాతం ఓటింగ్ నమోదయ్యింది.