KMR: సోమార్‌పేట్‌లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై దాడి జరిగిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరా తీశారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఓడిపోయిన అభ్యర్థి ఇంటిపై గెలిచిన సర్పంచ్ అభ్యర్థి అమానుషంగా దాడి చేసిన ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని KTR డిమాండ్ చేశారు. ఈ మేరకు SP రాజేష్ చంద్రకు స్వయంగా ఫోన్ చేశారు.