అన్నమయ్య: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో PGRS కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన నేరుగా విని అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయకుండా చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.