Team India: అదే ఆట.. అదే చెత్త ఫీల్డింగ్, ఆరో బౌలర్ ఉండరు.. వెరసి జగజ్జేతగా నిలవాలని అనుకున్న టీమిండియా (Team India) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోసారి ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. టాస్ గెలిచిన ఆసీస్.. మ్యాచ్ కూడా అలవోకగా నెగ్గింది. ఆసీస్ కెప్టెన్ నమ్మకాన్ని బౌలర్లు వమ్ము చేయలేదు. భారత్ టాప్ ఆర్డర్‌ను పేక మేడలా కూల్చారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 240 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ ధాటిగా ఆడటంతో ఆ మాత్రం అయినా స్కోర్ అయ్యింది. లేదంటే 200 లోపు చేసిన ఆశ్చర్య పోనవసరం లేకపోయేది.
241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆది నుంచి ధాటిగ ఆడింది. డేవిడ్ వార్నర్ వికెట్ త్వరగానే కోల్పోయింది. తర్వాత మార్ష్, స్మిత్ వికెట్లు పోవడంతో.. టీమిండియా, అభిమానులకు ఆశ కలిగింది. కానీ వారి ఆశలపై హెడ్ నీళ్లు చల్లాడు. ఓ బౌలర్ అయినా సరే చీల్చి చెండడాడు. లక్ష్యం తక్కువగా ఉండటంతో తొలుత మెల్లిగా ఆడాడు. తర్వాత ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయాడు. చివరికి 137 పరుగుల వద్ద ఔటయ్యాడు.
లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలోనే ఛేధించింది. కేవలం 4 వికెట్లు కోల్పోయి.. 7 ఓవర్లు ఉండగానే చేజ్ చేసింది. మరో 100 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ పేరు మోసిన బ్యాట్స్ మెన్ అంతా చేతులెత్తేశారు. ఇంకేముంది.. వరల్డ్ కప్ గెలుస్తామని గొప్పలు పోయిన వారంతా నేలమొహం వేశారు. అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.