»Akshay Kumar Shocking Bollywood Star Hero Lost A Thousand Crores
Akshay Kumar: షాకింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో వెయ్యి కోట్ల నష్టం?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. మిగతా స్టార్ హీరోలు వెయ్యి కోట్లు కొల్లగొట్టేందుకు దూసుకుపోతుంటే.. అక్షయ్ మాత్రం వెయ్యి కోట్ల నష్టం మిగిల్చాడు అనేది షాకింగ్‌గా మారింది.
Akshay Kumar: Shocking.. Bollywood star hero lost a thousand crores?
Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటు పోతున్నాడు ఈ ఖిలాడీ. కానీ.. అక్షయ్ ఒక సాలిడ్ హిట్ చూసి చాలా కాలమే అవుతోంది. అంతేకాదు.. వెయ్యి కోట్ల విషయంలో అక్షయ్ ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేశాడనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోల సినిమాలకు హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లు ఈజీగా వసూళ్లు చేస్తున్నాయి. కానీ.. అక్షయ్ కుమార్ మాత్రం తన సినిమాలతో ఏకంగా వెయ్యి కోట్ల వరకు నష్టాన్ని ఇచ్చినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఒకప్పుడు అక్షయ్ కుమార్ సినిమాకు యమా క్రేజ్ ఉండేది. కానీ గత కొంతకాలంగా ఈ హీరో సినిమాల గురించి ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దానికి కారణం.. రొటీన్ యాక్షన్ సినిమాలనే చెప్పాలి. చెప్పాలంటే.. ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్‌కు ఒక్క హిట్ కూడా పడలేదు. లేటెస్ట్గా విడుదలైన ‘సర్ఫిరా’ మూవీ కూడా అక్షయ్‌ని కాపాడలేకపోయింది. దీంతో.. మరో ఫ్లాప్ మూవీని తన ఖాతలో వేసుకున్నాడు.
ఇక అంతకు ముందు వచ్చిన బెల్ బాటమ్, లక్ష్మి, కట్పత్లి, అత్రంగి రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్విరాజ్, రక్షా బంధన్, రామ్ సేతు, సెల్ఫీ’, మిషన్ రాణిగంజ్, బడే మియా చోటే మియా.. చిత్రాలు వరుసగా ఫ్లాప్స్ ఇచ్చాయి. ఇందులో.. బడే మియా చోటే మియా ఏకంగా 250 కోట్లు నష్టాలు తెచ్చిపెట్టగా.. ‘సామ్రాట్ పృథ్విరాజ్’ 150 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. దీంతో.. అక్షయ్ ఫ్లాప్ సినిమాలకు వచ్చిన మొత్తం నష్టం.. దాదాపు 1000 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. కాబట్టి.. ఇది కూడా ఓ రికార్డ్‌గానే చెప్పొచ్చు. ఏదేమైనా.. చాలా స్పీడ్‌గా సినిమాలు చేసుకుంటు పోతున్న అక్షయ్.. కథ, కంటెంట్ పై కాస్త దృష్టి పెడితే బెటర్ అని అంటున్నారు.