టీమిండియా (TeamIndia) డైనమిక్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (SubhmanGill) వరల్డ్ రికార్డును బద్దలు (worldRecordBreak) కొట్టాడు. నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా, న్యూజిలాండ్ (New Zealand) టీమ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డును శుభ్‌మన్ గిల్ బద్దలు కొట్టాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మన్‌గా గిల్ రికార్డు నమోదు చేశాడు. కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే 2 వేల పరుగులు సాధించి శుభ్‌మన్ గిల్ ఈ రికార్డును నెలకొల్పడం విశేషం. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం హషీమ్ ఆమ్లా పేరుపై ఉండేది.
హషీమ్ ఆమ్లా 40 ఇన్నింగ్స్ లలో 2,000 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు ఆ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇటీవలే అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్ శిఖర్ ధావన్ రికార్డును కూడా శుభ్‌మన్ గిల్ బద్దలు కొట్టడం విశేషం. మరోవైపు భారత క్రికెటర్ మహ్మద్ షమీ కూడా ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టి అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. వన్డేల్లో అత్యధిక వికెట్లు 32 సాధించి భారత క్రికెటర్ల జాబితాలో మూడో స్థానంలోకి చేరాడు.