Shikar Dhawan: టీమ్ఇండియా క్రికెటర్ శిఖర్ దావన్ దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దంపతులు విడిపోయిన తర్వాత తన కుమారుడు జొరావర్ను కలుసుకోలేకపోతున్నాడని పోస్ట్ చేశారు. విడాకుల తర్వాత కుమారుడు తన భార్య అయేషా ముఖర్జీ వద్దే ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే తాజాగా శిఖర్ దావన్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా నిన్ను చూసి ఏడాది అవుతోందని శిఖర్ దావన్ భావోద్యేగమైన పోస్ట్ చేశారు.
కొన్ని నెలల క్రితం వీడియోకాల్లో మాట్లాడిన ఫొటోను షేర్ చేస్తూ.. నిన్ను నేరుగా చూసి ఏడాది దాటింది. నిన్ను నాకు పూర్తిగా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత మూడు నెలల నుంచి నీతో మాట్లాడనివ్వకుండా అన్ని విధాలుగా బ్లాక్ చేస్తున్నారు. నేను నీతో నేరుగా మాట్లాడకపోయినప్పటికీ.. టెలీపతితో ఎప్పటికీ నీ మనసుకు దగ్గరగానే ఉంటానని దావన్ తెలిపారు. నువ్వు ఉన్నతంగా ఎదుగుతావని నాకు తెలుసు. ఈ పాప ఎప్పుడూ నిన్ను మిస్ అవుతూనే ఉంటాడు. నీ నవ్వు కోసం ఎదురుచూస్తునే ఉంటాడు. దేవుడి దయ వల్ల మళ్లీ మనం కలుస్తామని ఆశిస్తున్నా.. ధైర్యంగా ఉండటంతో పాటు దయ, వినయం, సహనంతో మెలుగు అంటూ పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
శిఖర్ దావన్ భార్య తనని మానసికంగా వేధిస్తోందని విడాకులు తీసుకున్నాడు. అయితే తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం ధావన్ చేసిన అభ్యర్థనపై తీర్పు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ధావన్ తన కుమారుడితో వీడియో కాల్లో మాట్లాడేందుకు అనుమతినిచ్చింది. స్కూల్ వెకేషన్ సమయంలో ఆయేషా తన కుమారుడిని భారత్కు తీసుకొచ్చి ధావన్ కుటుంబంతో సమయం గడిపేలా చూడాలని కోర్టు ఆదేశించింది.