ATP: ఆర్డీటీ కోసం బహుజన రాజ్యాధికార జేఏసీ నిర్వహించిన వెయ్యి కిలోమీటర్ల ‘చలో రాజధాని’ పాదయాత్ర ముగింపు సందర్భంగా అనంతపురంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి పాల్గొని, మాట్లాడారు. సామాజిక న్యాయం, సేవా సంస్థల పరిరక్షణ కోసం చేపట్టిన ఈ యాత్రకు సహకరించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.