IND vs NZ: న్యూజిలాండ్ ఆలౌట్..టీమిండియా టార్గెట్ 274
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ జట్టు టీమిండియా ముందు 274 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
వన్డే వరల్డ్ కప్-2023 (Icc World Cup-2023) టోర్నీలో నేడు టీమిండియా (TeamIndia), న్యూజిలాండ్ (New Zealand) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియా ముందు 274 పరుగుల టార్గెట్ నిలిచింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ (Mahammad Shami)లు చేరారు. మ్యాచ్ ప్రారంభంలోనే నాలుగో ఓవర్లో మహ్మద్ సిరాజ్ వేసిన మూడో బంతికి న్యూజిలాండ్ ఓపెనర్ డేవన్ కాన్వే డకౌట్ అయ్యాడు. దీంతో 9 పరుగులకే కివీస్ ఓ వికెట్‌ను కోల్పోయింది. మహ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్ 2, బుమ్రా, సిరాజ్ ఇద్దరూ చెరొక వికెట్ తీశారు.
న్యూజిలాండ్ (New Zealand) బ్యాటర్లలో డెరిల్ మిచెల్ 130, రచిన్ రవీంద్ర 75 పరుగులు చేశారు. మిగిలిన వారంతా క్రీజ్‌లో ఎక్కువసేపు నిలువలేకపోయారు. విల్ యాంగ్ 17 పరుగులు, గ్లెన్ పిలిప్స్ 23 పరుగులు చేశారు. మిలిన వారు డబుల్ డిజిట్ స్కోర్‌ను కూడా చేయలేకపోయారు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ (Mahammed Shami) ఓ రికార్డును బ్రేక్ (Record Break) చేశాడు. టోర్నీ చరిత్రలో 32 వికెట్లు తీయడం ద్వారా షమీ అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్ జట్టు 273 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో టీమిండియా విజయ లక్ష్యం 274 పరుగులు నిలిచింది.