రంజీ ట్రోఫీలో హైదరాబాద్ కుర్రాడు 147 బంతులకే 300 పరుగులు చేసి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాడు. రంజీ ట్రోఫీ 2003-24 సీజన్లో హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ చేసి సంచలనం రేకెత్తించాడు. అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో హైదరాబాద్ జట్టు తలపడగా అందులో తన్మయ్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
Magnificent! 🤯
Hyderabad's Tanmay Agarwal has hit the fastest triple century in First-Class cricket, off 147 balls, against Arunachal Pradesh in the @IDFCFIRSTBank#RanjiTrophy match 👌
He's unbeaten on 323*(160), with 33 fours & 21 sixes in his marathon knock so far 🙌 pic.twitter.com/KhfohK6Oc8
తన్మయ్ మొదటి నుంచి టీ20 మ్యాచ్ తరహాలో దంచికొడుతూ స్కోరును ముందుకు కదిలించాడు. ఈ క్రమంలో 147 బంతుల్లోనే 300 మార్కును అందుకుని అరుదైన ఘనతను సాధించడం విశేషం. తన్మయ్ తన ఇన్నింగ్స్‌లో 20 సిక్సర్లు బాదాడు. సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరేస్ పేరుపై ఉన్న రికార్డును తన్మయ్ బద్దలు కొట్టాడు. గతంలో సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్లో బోర్డర్ జట్టుకు మార్కో ప్రాతినిథ్యం వహిస్తూ ఈస్టర్న్ ప్రావిన్స్ మీద 191 బంతుల్లో 300 పరుగులు సాధించాడు. అయితే తన్మయ్ 147 బంతుల్లోనే ఈ మార్కును అందుకోవడం విశేషం.
ఇదే మ్యాచ్‌లో తన్మయ్ అగర్వాల్ మరో రికార్డును సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 39 ఏళ్లుగా టీమిండియా మాజీ బ్యాటర్ రవిశాస్త్రి పేరుపై ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును త్మయ్ బ్రేక్ చేశాడు. 119 బంతుల్లోనే 200 పరుగులు చేసి ఆ ఘనతను సాధించాడు.