»Ind Vs Afg Booming Indian Bowlers Team Indias Victory In The First T20
IND vs AFG: విజృంభించిన భారత బౌలర్లు.. తొలి టీ20లో టీమిండియా విజయం
తొలి టీ20 మ్యాచ్లో ఆఫ్ఘన్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. భారత బౌలర్లు సరైన రీతిలో తమ ప్రదర్శనను చూపడంతో ఆఫ్ఘన్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో టీమిండియా తొలి టీ20లో విజయం సాధించింది.
భారత్, ఆఫ్ఘన్ మధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొహలీ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్ లో భారత్ ఆధిక్యంతో కొనసాగుతోంది. 159 పరుగుల టార్గెట్ ను భారత్ 17.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టంతో ఛేదించింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబె 40 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. జితేశ్ శర్మ 31, తిలక్ వర్మ 26, శుభ్ మన్ గిల్ 23 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో బుజీబ్ రెహ్మాన్ 2 వికెట్లు తీయగా అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
ఆఫ్ఘన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ 42, అజ్మతుల్లా ఒమర్జాయ్ 29, ఇబ్రహీం జద్రాన్ 25, రహ్మానుల్లా గుర్బాజ్ 23 పరుగులు చేశారు. ఇకపోతే భారత్ బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా, శివమ్ దూబె ఓ వికెట్ తీశాడు. ఆఫ్ఘన్ నమోదు చేసిన 158 పరుగుల టార్గెట్ ను టీమిండియా ఛేదించడంతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు ముఖ్యపాత్ర పోషించారు. సరైన రీతిలో బౌలింగ్ చేయడం వల్ల ఆఫ్ఘన్ బ్యాటర్లను కట్టడి చేసి విజయం సాధించారు.