»Big Shock To Team India Hardik Pandya Is Unable To Play Series
Team Indiaకు బిగ్ షాక్.. సిరీస్ నుంచి పాండ్యా ఔట్..?
వరల్డ్ కప్‌లో మంచి ఊపు మీద ఉన్న రోహిత్ సేనకు షాక్ తగిలింది. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సిరీస్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. చీలమండ గాయం ఎక్కువ అవడంతో సిరీస్‌కు దూరం కానున్నారు.
Big Shock To Team India Hardik Pandya Is Unable To Play Series
Hardik Pandya: వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరసగా 5 మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపుమీదుంది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ బెర్త్ ఖాయం. ఇంతలో రోహిత్ సేనకు షాక్ తగలింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) చీలమండ గాయం ఇబ్బంది పెడుతోంది.
గాయం వల్ల పాండ్యా (Hardik Pandya) టోర్నీ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే నిజంగానే భారత్‌కు షాక్.. పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్.. లేదంటే బౌలింగ్‌తో విరుచుకు పడతాడు. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. దీంతో పాండ్యా లేని లోటును తీర్చడం కాస్తా కష్టమే. వరల్డ్ కప్ లాంటి కీలక సిరీస్ సమయంలో ఇది నిజంగా షాక్ అని క్రికెట్ ఆనలిస్టులు అభిప్రాయ పడుతున్నారు.
బెంగళూరులో గల ఎన్సీఏలో నితిన్ పటేల్ ఆధ్వర్యంలో వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. పాండ్యా చీలమండకు అయిన గాయం ఫస్ట్ కన్నా ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. దీంతో పాండ్యా ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని.. సిరీస్‌కు మొత్తం దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాండ్యా గాయం, అతను సిరీస్‌లో ఆడేది, విశ్రాంతి తీసుకునే అంశానికి సంబంధించి బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ గాయం వల్ల ఆడక పోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో ఊపిరి పీల్చుకోవచ్చు.