MI జట్టుకు మహ్మద్ కైఫ్ కీలక సూచనలు చేశాడు. పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ బాధ్యతలను సూర్యకు అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో కైఫ్ స్పందించాడు. పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించడం పెద్ద పొరపాటే అవుతుందని అభిప్రాయపడ్డాడు. అతడి కెప్టెన్సీలో MI ప్రదర్శన పడిపోయిన మాట వాస్తవమేనని అన్నాడు. అయితే ప్రస్తుతం కెప్టెన్‌గా పాండ్యా కుదురుకున్నాడని తెలిపాడు.
తాను స్వతహాగా బౌలింగ్ ఆల్‌రౌండర్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గానూ ఆడానని టీమిండియా & RCB ప్లేయర్ కృనాల్ పాండ్యా పేర్కొన్నాడు. చాలా మంది తనను బౌలర్‌గానే చూస్తున్నారని, నిజానికి తనకు బ్యాటింగ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. గత IPLలో ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్‌గా నిలిచిన పాండ్యా.. భారత్ తరఫున ఆడి దాదాపు ఐదేళ్లు అవుతోంది.
న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ కెప్టెన్ అమెలియా కెర్, మెన్స్ టీమ్ బౌలర్ జాకబ్ డఫ్పీ ‘న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డ్ అందుకున్నారు. డఫ్పీకి ఇది తొలి అవార్డ్ కాగా.. కెర్‌కి వరుసగా 4వ పురస్కారం కావడం విశేషం. టెస్ట్ ప్లేయర్-2025 కూడా డఫ్పీనే అందుకోగా.. కెర్ ఉమెన్స్ T20 ప్లేయర్‌గా నిలిచింది.
IPL 2026లో అభిషేక్ నాయర్ KKRకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘IPL హెడ్ కోచ్‌గా అభిషేక్‌కి ఇది తొలి సీజన్. WPLలో UPWకు హెడ్ కోచ్, టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా చేసిన అనుభవం ఉన్నా.. IPL పూర్తిగా వేరే. సరైన కెప్టెన్ కూడా లేని KKR అతనికి చాలా పెద్ద అసైన్మెంట్. ఏం చేస్తాడో చూడాలి’ అన్నాడు.
IPLలో ఒకే మ్యాచులో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా CSK మాజీ ప్లేయర్ మురళీ విజయ్ కొనసాగుతున్నాడు. 2020లో RRపై అతను 56 బంతుల్లోనే 127 రన్స్ చేసే క్రమంలో ఈ రికార్డ్ నెలకొల్పాడు. 2018లో శాంసన్, 2023లో గిల్, 2025లో అభిషేక్ పదేసి సిక్సర్లతో రాణించారు కానీ విజయ్ రికార్డ్ అందుకోలేకపోయారు. ఓవరాల్‌గా గేల్(2013లో 17), బ్రెండన్ మెకలమ్(2008లో 13) తొలి 2 స్థానాల్లో ఉన్నారు.
జింబాబ్వే 3 వన్డేల సిరీస్ కోసం 2027 జనవరిలో భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా 2002 తర్వాత భారత పర్యటనకు జింబాబ్వే రావడం ఇదే తొలిసారి. నాడు జింబాబ్వేపై భారత్ 2-0తో టెస్ట్ , 3-2తో వన్డే సిరీస్‌లను సొంతం చేసుకుంది. కాగా ఇరుజట్ల మధ్య జరిగిన గత 4 వన్డే సిరీస్(2013, 2015, 2016, 2022)ల్లోనూ జింబాబ్వే తమ సొంతగడ్డపైనే వైట్ వాష్ అయ్యింది.
దేశవాళీ సంచలనం వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టుకు ఎలిజిబిలిటీ సాధించాడు. ఇవాళ తన 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దీంతో ఇప్పటికే గేల్ ‘175 రన్స్’ రికార్డ్ బ్రేక్ చేయడమే తన గోల్ అని చెప్పిన వైభవ్.. ఈ సీజన్‌లో రాణిస్తే త్వరలోనే BCCI పిలుపు అందుకునే ఛాన్స్ ఉంటుంది. కాగా ICC రూల్స్ ప్రకారం సీనియర్ జట్టుకు ఆడాలంటే.. ప్లేయర్ కనీస వయసు 15 ఏళ్లుగా ఉండాలి.
IPLలో ఓ ప్లేయర్ వరుసగా 3 సీజన్లలో 600+ రన్స్ చేయడం అంటే మాములు విషయం కాదు. అందుకేనేమో.. 18 ఏళ్ల టోర్నీలో ముగ్గురికే ఈ ఫీట్ సాధ్యమైంది. తొలుత గేల్ 2011లో 608, 2012లో 733, 2013లో 708 రన్స్ చేయగా.. ఆపై KL రాహుల్ 2020లో 670, 2021లో 626, 2022లో 616 పరుగులు రాబట్టాడు. ఇక 2023లో 639, 2024లో 741, 2025లో 657 చేసిన కోహ్లీ.. వరుసగా 4 సీజన్‌లోనూ 600+ […]
సౌత్ ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(SAFF) U20 ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో పాక్‌ను టీమిండియా చిత్తుచేసింది. మన ప్లేయర్లు విశాల్ యాదవ్ 1, ఓమాంగ్ డోడమ్ 2 గోల్స్ చేయడంతో పాక్ 0-3తో ఓడింది. ముందుగా బంగ్లా, తర్వాత భారత్ చేతిలో ఓడిన పాక్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-B నుంచి బంగ్లా, భారత్ సెమీస్‌కు చేరగా.. అగ్రస్థానం కోసం రేపు ఇరుజట్లు ఢీకొననున్నాయి.
IPLలో ఓ అద్భుత రికార్డ్ గుజరాత్ టైటాన్స్ సొంతం. 2025లో ఆ టీమ్ తరఫున సాయి సుదర్శన్ 759, శుభ్‌మన్ గిల్ 650, జోస్ బట్లర్ 538 రన్స్ చేశారు. IPL చరిత్రలో ఒకే సీజన్‌లో ఓ జట్టు నుంచి ముగ్గురు ప్లేయర్లు 500+ స్కోర్స్ చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు సీజన్లలో ఇలా RCB, CSK, MI, SRH, DC, LSG తరఫున ఇద్దరేసి ప్లేయర్లే 500+ స్కోర్స్ చేయగలిగారు.
IPL 2026లో బ్యాటర్‌గా తాను నిరూపించుకోవాల్సింది ఏం లేదని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ పేర్కొన్నాడు. గత 3-4 సీజన్లలో తాను అద్భుతంగా రాణించానని.. ఇప్పుడు తన గోల్ జట్టును టైటిల్ దిశగా నడిపించడమేనని స్పష్టం చేశారు. చివరి నాలుగేళ్లలో జట్టు మంచి ప్రదర్శన చేసిందని.. ఇలాగే ఆడితే మరో సారి కప్ అందుకుంటామని ధీమా వ్యక్తంచేశాడు. కాగా 2022లో GT టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.