ఆసీస్ జరుగుతున్న టెస్ట్ సీరీస్లో చివరి రెండు మ్యాచ్లకు టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకున్న షమి.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరుఫున ఆడుతూ.. ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. షమి త్వరలో ఆస్ట్రేలియా పయనం కానున్నాడని అందుకు సంబంధించి వీసా కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది.