ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తడబడుతోంది. మూడో రోజు 128/5 వద్ద భారత్ ఆట ప్రారంభించింది. క్రీజులో పంత్ (28), నితీష్ (15) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక భారత్ గెలవాలంటే ఈ ఇద్దరు భారీ భాగస్వామ్యం నెలకొల్పాలి. కాగా మొదటి ఇన్నింగ్స్లో భారత్ 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 337 పరుగులు చేయడంతో భారత్ ఇంకా 29 పరుగులు వెనకబడి ఉంది.