KMR: ఇందిరా గాంధీ స్టేడియంలో ఆదివారం నుంచి మాస్టర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రంజిత్ మోహన్ తెలిపారు. 30 ఏళ్ల నుంచి 80 ఏళ్లలోపు మహిళలు, పురుషులకు 100, 200, 400, 800 మీటర్ల పరుగు,5000,10, 000 మీటర్ల నడక, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు.