ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఆసీస్ బౌలర్ల దాటికి బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోతున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే పంతా కొనసాగిస్తున్నారు. కీలక భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలమవుతున్నారు. భారత్ గెలవాలంటే క్రీజులో ఉన్న పంత్(28), నితీష్(15) భారీ భాగస్వామ్యం నెలకొల్పాలి. ప్రస్తుతం భారత్ స్కోర్ 128/5.