ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్.. టీమిండియాకు తలనొప్పిగా మారాడు. AUSతో జరిగిన కీలక మ్యాచుల్లో అతడు భారత్‌పై ప్రతిసారి పైచేయి సాధిస్తున్నాడు. WTC-2023 ఫైనల్లో 163 పరుగులు చేసి టీమిండియాకు టైటిల్ దూరం చేశాడు. అలాగే 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో మెరుపు సెంచరీతో భారత్‌ను దెబ్బకొట్టాడు. ఇక ఇప్పుడు ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులోనూ.. శతకం బాది ఆసీస్ విజయానికి కారణమయ్యాడు.