W.G: వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందాన్ని వ్యతిరేకించిన కూటమి, నేడు అదే విధానాన్ని అమలు చేస్తూ ప్రజలపై భారాలు మోపుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు చింతకాయల బాబురావు విమర్శించారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం పెంటపాడు గేట్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.