NZB: ‘ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం’ నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని BRS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం BRS జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోకల్ వార్ వన్ సైడ్.. కాంగ్రెస్, బీజేపీల పతనం డిసైడ్ అని వ్యాఖ్యానించారు.