KRNL: కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడంలో పూర్తిగా విఫలం చెందిందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప అన్నారు. సోమవారం కర్నూలులోని సీఆర్ భవనం నందు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందని మునెప్ప అన్నారు.