AKP: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో మొత్తం 45 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. అందులో 30 భూ తగాదాలు, 5 కుటుంబ కలహాలు, 1 మోసం, 4 ఇతర విభాగాలకు చెందినవి ఉన్నట్లు వెల్లడించారు .7 రోజుల లోపుగా విచారణ పూర్తి చేసి, తక్షణ పరిష్కారం కల్పించాలని ఎస్పీ తెలిపారు.