NZB: వినాయక చవితి ఉత్సవాలకు డీజే సౌండ్ సిస్టంలను వాడకూడదని ఆర్మూర్ SHO సత్యనారాయణ గౌడ్ సూచించారు. సోమవారం ఆయన ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో DJ సౌండ్ సిస్టం యాజమానులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. వినాయక మండపాలు పెట్టేవారు అడ్వాన్సుగా DJ బుకింగ్ చేసుకుంటే వాటిని వెంటనే రద్దు చేసుకోవాలని ఆదేశించారు.