అన్నమయ్య: జిల్లా పోలీసు కార్యాలయంలో ‘మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వినతులను సంబంధిత అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు తెలిపారు. దివ్యాంగుడి సమస్యను ప్రత్యక్షంగా విని తగిన చర్యలు చేపట్టారు.