W.G: పీ- 4 భారాన్ని ఉద్యోగులపై నెట్టే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ సోమవారం ఒక ప్రకటనలో అన్నారు. లేబర్ కోడ్స్ లాంటి దుర్మార్గ చట్టాలను రుద్దుతూ మరోవైపు వారిపై పీ4 భారాన్ని నెట్టటం అమానుషమని గోపాలన్ అన్నారు. తక్షణం ఈ ప్రతిపాదన ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. పేదరిక నిర్మూలనపై చర్యలు తీసుకోవాలన్నారు