దుబాయ్లో జరుగుతున్న ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో అంతిమ సమరానికి సమయం ఆసన్నమైంది. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాసేపట్లో ఫైనల్ జరగనుంది. గతేడాది సెమీస్లో బంగ్లా చేతిలో ఓడిన టీమిండియా.. ఇప్పుడు ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఏ జట్టు సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఇప్పటివరకు ఈ టోర్నీ చరిత్రలో టీమిండియా 8సార్లు విజేతగా నిలిచింది.