ఆడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్‌పై ఆసీస్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా 60.71 శాతం పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. 57.29 శాతంతో భారత్ మూడో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా.. 59.26 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.