ELR: అర్హత ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకి అక్రిడేషన్ మంజూరు చేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గృహ నిర్మాణ పథక ప్రగతిపై సమీక్ష సమావేశానికి కైకలూరు విచ్చేసిన సారథి మాట్లాడారు. ఆగస్టులోగా అర్హత ఉన్న ప్రతి విలేకరికి అక్రిడేషన్ మంజూరు చేస్తామన్నారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల మంజూరుకు కృషిచేస్తామన్నారు.