KNR: చొప్పదండి మండలంలో భూభారతి దరఖాస్తులు మొత్తం 3322 రాగా 1800 దరఖాస్తులకు నోటీసులు అప్లోడ్ చేసినట్లు మండల తహశీల్దార్ పి. నవీన్ కుమార్ తెలిపారు. మిగతావి కూడా ఆగస్టు ఫస్ట్లోపు అప్లోడ్ చేస్తామన్నారు. ఆగస్టు15 లోపు దరఖాస్తులన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు. సాదా బైనామాలు, ప్రభుత్వ భూములపై 1760 దరఖాస్తులు రాగా మిగతావన్నీ పట్టా భూములపై వచ్చాయన్నారు.