బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 23 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. రెండు టెస్టుల ఈ సిరీస్ 2026-27 ఆసీస్ హోమ్ సీజన్‌కు ఆరంభం కానుంది. గతంలో 2017లో మీర్పూర్లో ఆసీస్‌ను ఓడించి బంగ్లా సంచలనం సృష్టించింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తలపడనుండటంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.