టీమిండియాకు మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో మార్పులు చేయాలని తెలిపాడు. అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. అలాగే, వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఈ మ్యాచ్‌లో ఆడించాలని పేర్కొన్నాడు. దీంతో బ్యాటింగ్‌లో బలం పెరుగుతుందన్నాడు. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, పాండ్యా సరిపోతారని వ్యాఖ్యానించాడు.