ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ రూట్ కొత్త రికార్డ్ నమోదు చేశాడు. కీవీస్‌తో జరుగుతున్న టెస్ట్‌లో రూట్ (73*) పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రూట్ 151 టెస్టుల్లో 65 హాఫ్ సెంచరీలు, 35 సెంచరీలతో 100 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ ద్రవిడ్(99) పేరుతో ఉండేది. తర్వాతి స్థానాల్లో చంద్రపాల్(96), సంగక్కర(90), బోర్డర్(90) నిలిచారు.